చిరుపై నాన్‌ బెయిలబుల్‌ వారంట్

Chiranjeevi
నరసరావుపేట: నిబంధనలకు విరుద్ధంగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో రోడ్‌ షో నిర్వహించిన కేసులో పీఆర్పీ అధినేత చిరంజీవిపై నరసరావుపేట ఒకటో అదనపు మునిసిఫ్‌ మెజ్రిస్టేట్‌ కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌(ఎన్‌బీడబ్ల్యు) బుధవారం జారీచేసింది. ఫిబ్రవరి 12న చిరంజీవి అర్ధరాత్రి దాటాక రోడ్‌ షో నిర్వహించి రెండుచోట్ల అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు.

హైకోర్టు ఉత్తర్వులను, పోలీసు చట్టాల ఉల్లంఘన, ప్రజలకు అసౌకర్యం కలిగించారని పేర్కొం టూ పోలీసులు చిరంజీవిపై కేసు నమోదు చేశారు. ఆయనతోసహా మొత్తం10మంది ఈ కేసులో నిందితులుగా వున్నారు. చిరంజీవి మినహామిగిలిన ఆ పార్టీ నేతలు పోలీసుస్టేషన్‌లో హాజరై స్టేషన్‌ బెయిల్‌ పొందారు. కాగా చిరంజీవి హాజరుకాకపోవటం తో పోలీసులు పైకోర్టులో అభియోగపత్రం ఇటీవల దాఖలు చేశారు. ఈ మేరకు మెజ్రిస్టేట్‌ వెంకటేశ్వర్లు నాయక్‌ చిరంజీవిపై ఎన్‌ బీడబ్ల్యు జారీచేశారు. ఈ కేసును జూన్‌ 19కి వాయిదా వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+