ఇండియన్స్ పట్ల ఫ్రాన్స్ లో జాతి వివక్ష
ముంబయి: ఎయిర్ ఫ్రాన్స్ మరోసారి జాతి వివక్ష ఆరోపణలను ఎదుర్కుంది. ఎయిర్ ఫ్రాన్స్ పై ఇటువంటి ఆరోపణ రావడం ఇది రెండో సారి. ఇంతకు ముందు ఫ్పాన్స్ ఎయిర్ లైన్స్ సిబ్బంది తమ పట్ల జాతి వివక్షతో వ్యవహరించారని 55 మంది ప్రయాణికులు ఆరోపణలు చేశారు. తాజాగా ఇప్పుడు మరో పది మంది ప్రయాణికులు ఇదే ఆరోపణ చేస్తున్నారు. ప్యారిస్ విమానాశ్రయంలో సోమవారం కొద్దిసేపు ఆగినప్పుడు ఎయిర్ లైన్స్ సిబ్బంది తమ పట్ల జాతి వివక్షతో వ్యవహరించి తమను అవమానించారని వారు ఆరోపిస్తున్నారు.
వాషింగ్టన్ నుంచి ముంబయికి బయలుదేరిన భారత ప్రయాణికులు పది మందికి ప్యారిస్ లో లింక్ విమానం తప్పిపోయింది. వాషింగ్టన్ నుంచి సాంకేతిక కారణాల వల్ల వారు ప్రయాణించిన విమానం ఆలస్యంగా బయలుదేరడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. దాంతో వారు 13 గంటల పాట సాండ్ విచ్, బాటిల్ నీళ్లతో గడపాల్సి వచ్చింది. ఆ విమానంలో ప్రయాణించిన అమెరికన్లను, యూరోపియన్లను, అమెరికా పాస్ పోర్టులు ఉన్న భారతీయులను మాత్రం హోటళ్లకు తీసికెళ్లారు. దీంతో ట్రాన్సిట్ వీసాలు ఉన్న ఆ పది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు.












Click it and Unblock the Notifications