'సాక్షి'పై దాడిలో జెసి అనుచరుడు
అనంతపురం: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు, పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని సాక్షి దినపత్రిక అనంతపురం జిల్లా తాడిపత్రి కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 25వ తేదీన వైయస్ రాజశేఖర రెడ్డి మంత్రి వర్గ ప్రమాణ స్వీకారం జరిగిన రోజు తాడిపత్రిలోని సాక్షి కార్యాలయంపై దాడి జరిగింది. మంత్రి పదవి దక్కని తాడిపత్రి శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి అనుచరులే ఈ దాడికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే దాడి చేసింది తన అనుచరులు కాదని జెసి చెప్పారు.
పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుల్లో ఒక వ్యక్తి జెసి దివాకర్ రెడ్డి అనుచరుడని తెలుస్తోంది. మరో వ్యక్తి ఒక పత్రికా విలేకరి కాగా మరో ఇద్దరు ఎంసిఎ విద్యార్థులని సమాచారం. వీరిని పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సాక్షి కార్యాలయంపై జరిగిన దాడిలో జర్నలిస్టు తీవ్రంగా గాయపడ్డాడు.












Click it and Unblock the Notifications