హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్దత కల్పించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవ తీసుకోవాలని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో కోరారు.
జూన్ 5,6 తేదీల్లో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించి రాజకీయ కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. వర్గీకరణ చట్టబద్దతకు పూనుకోకపోతే ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు.