నేటి నుంచి లోక్ సభ సమావేశాలు

గురువారం రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ పార్లమెంటులోని ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. శనివారం సమావేశమైన ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ రాష్ట్రపతి ప్రసంగాన్ని ఖరారు చేసింది. ఈ ప్రసంగంలో సంక్షేమ పథకాలను బలోపేతం చేయడానికి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి తన ప్రభుత్వం తీసుకోనున్న చర్యలపై ప్రధానంగా దృష్టిసారించినట్టు చెబుతున్నారు. ఈ ప్రసంగంలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాల విధానాలు, వాగ్దానాలకు అనుగుణంగా రానున్న సంవత్సర కాలానికి ప్రభుత్వ అజెండాను ఆవిష్కరిస్తారు.












Click it and Unblock the Notifications