స్పీకరు పదవికి టీడీపి పోటీ

కిరణ్ కుమార్ రెడ్డిని స్పీకర్ పదవికి ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి రోశయ్య తెదేపా అధినేత చంద్రబాబుకు ఫోన్‌ద్వారా సమాచారం అందించినట్లు జనార్దన్‌రెడ్డి తెలిపారు. దీనిపై తమ నిర్ణయాన్ని అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలతో చర్చించి వెల్లడిస్తామని తెలిపారు. ఆనవాయితీ ప్రకారం ప్రొటెం స్పీకర్ పదవిని సీనియర్ అయిన అశోక్ గజపతిరాజుకు ఇవ్వకుండా జేసీకి కేటాయించడాన్ని నాగం తప్పుబట్టారు.
కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ అయితే కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగాను, తెలుగుదేశం పార్టీ సభ్యుల పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరించే అవకాశాలున్నాయని చంద్రబాబు ఈ పదవికి పోటీ పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. పైగా గత ఐదేళ్ళుగా ప్రభుత్వ చీఫ్ విప్ గా వ్యవహరించిన కిరణ్ కమార్ రెడ్డి అడుగడుగునా టిడిపి సభ్యులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అడ్డుపడ్డారు. ఈ క్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి కాకుండా మరెవ్వరినైనా స్పీకర్ అభ్యర్థిగా ప్రకటిస్తే టిడిపికి అభ్యంతరం ఉండకపోయేది. ఈ నేపథ్యంతో ఈ సాయంత్రం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టిడిపి సీనియర్ ఎమ్మెల్యేలతో చర్చించి అశోక్ గజపతిరాజును బరిలో దింపాలని నిర్ణయించారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications