హైదరాబాద్: సినీ జీవితం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలుపొంది మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టడం తన జీవితంలో మర్చిపోలేని రోజని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం బయటకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు.సభలో అడుగుపెట్టగానే చెప్పలేని అనుభూతికి లోనయ్యానన్నారు. మనసా, వాచ, కర్మణ తన జీవితాన్ని రాజకీయ రంగంలో గడపడానికి కృషి చేస్తూ... పేద ప్రజలకు సేవ చేయడమే తన కర్తవ్యమని ఆయన తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు ఇచ్చారని ప్రజామోదాన్ని గౌరవిస్తూ స్పీకర్ పదవికి కిరణ్ కుమార్ రెడ్డిని ప్రతిపాదించామన్నారు. ప్రజా సమస్యలపై పరిస్థితులను బట్టి పోరాటం చేస్తామని ఆయన అన్నారు.