ప్రమాణం చేయని పరిటాల సునీత
హైదరాబాద్: ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయకుండానే అసెంబ్లీ నుంచి పరిటాల సునీత వెనుదిరిగారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం నుంచి ఎన్నికైన సునీత..ప్రొటెం స్పీకర్ జేసీ దివాకర్ రెడ్డి సమక్షంలో ప్రమాణం చేయడం ఇష్టంలేకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ప్రమాణానికి పేరు పిలవగానే సునీత అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారు. రేపు స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన భర్త పరిటాల రవి హత్య వెనుక జెసి దివాకర్ రెడ్డి హస్తం ఉందని పరిటాల అనుచరులు గట్టిగా నమ్ముతున్నారు.












Click it and Unblock the Notifications