స్పీకర్ గా మహిళ: రాష్ట్రపతి ప్రశంస

Meira Kumar
న్యూఢిల్లీ: లోక్ సభ స్పీకర్‌ గా ఓ దళిత మహిళను ఎన్నుకోవడం చాలా సంతోషదాయకమైన విషయమని రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ అన్నారు. నూతనంగా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొదటిసారి పార్లమెంట్‌లో ఇరు సభలను ఉద్దేశించి ఆమె ఈరోజు ప్రసంగించారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా సభ నడవాలని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు. అకుంఠిత దీక్షతో పనిచేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బెంగాల్‌ లో వచ్చిన తుఫాన్‌ వల్ల నిర్వాసితులైన వారికి తగిన సాయం అందిస్తామని ఆమె ప్రకటించారు.

ఉగ్రవాదం, హింసను అరికట్టేందుకు చట్టం తీసుకొస్తామన్నారు. దేశ అంతర్గత భద్రత దృష్ట్యా పౌరులందరికీ ప్రభుత్వం బహుళ ప్రయోజనాల గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు.రిటైర్డ్‌ సైనిక ఉద్యోగులకు ఒకే ర్యాంకు, ఒకే పింఛన్‌పై త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని భారత్‌ కు తీసుకొచ్చేందుకు ఆయా దేశాలతో చర్చిస్తామన్నారు. అభివృద్ధికి మరన్ని సంస్కరణలు చేయాలని ఆమె ప్రభుత్వానికి సూచించారు. పేదలందిరీ తిండి, బట్ట, గృహవసతి కల్పించడానికి కృషి చేస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+