విజయనగరం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన మీడియా ప్రతినిధులతో శనివారం చెప్పారు. గద్దే బాబూరావు చాలా కాలంగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఇటీవలి పార్టీ ఓటమి బహుశా ఆయనను కలత పెట్టి ఉంటుంది.