ఎన్నారై శాఖ ఆయనకే
హైదరాబాద్ : ప్రవాస భారతీయుల (ఎన్నారై) మంత్రిత్వ శాఖను కూడా శ్రీధర్ బాబుకు అప్పగించాలని ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దుద్దిళ్ళి శ్రీధర్ బాబు రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి గా చేస్తున్నారు. ఈ శాఖను ఆయనకు ముఖ్యమంత్రి అదనపు శాఖగా అప్పగించారు.ఆంధ్రులపై విదేశాల్లో భౌతిక దాడులు ఎక్కువైపోయిన తరుణంలో ఎన్నారై శాఖను శ్రీధర్ బాబుకు అదనంగా కేటాయించారని తెలుస్తోంది. విదేశాల్లో ఉంటున్న ప్రవాసాంధ్రులు ఎదుర్కొనే సాధక బాధకాలను ఇక నుంచి శ్రీధర్ బాబు పర్యవేక్షించి తగిన నిర్ణయాలు, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారు.












Click it and Unblock the Notifications