అమరావతిలో జగన్నాథ రథయాత్ర..! చంద్రబాబు ఏం కోరుకున్నారంటే?

అమరావతి రాజధానిలో జగన్నాథుడి రథయాత్ర (Jagannath rath yatra) ను సీఎం చంద్రబాబు (Chandrababu) ఇవాళ అట్టహాసంగా ప్రారంభించారు. రాజధానిలోని వెంకటపాలెం నుంచి రథయాత్రను సీఎం ప్రారంభించారు. పూరీ క్షేత్రంలో నిర్వహించే సంప్రదాయ క్రతువులను అనుసరిస్తూ జగన్నాథ, బలభద్ర, సుభద్రలతో కూడిన రథం ముందు చంద్రబాబు బంగారు చీపురుతో ఊడ్చి శుభ్రం చేసి స్వామివారి రథ యాత్రను తాడుతో లాగి ప్రారంభించారు.

రోజువారీ జీవితంలో ఒత్తిడి తగ్గించే అత్యుత్తమ మంత్రం ఆధ్యాత్మికత ఒక్కటేనని చంద్రబాబు తెలిపారు. సమాజాన్ని ప్రశాంతంగా ఉంచే క్షేత్రాలు మన దేవాలయాలన్నారు. సమాజంలో మానవ సంబంధాలు తగ్గి సామాజిక మాధ్యమాల ప్రతికూల ప్రభావం పడుతోందన్నారు. అందుకే కొన్ని కుటుంబాల్లో ఆత్మహత్యలు, చిన్నారులపై అఘాయిత్యాల లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. అందరి జీవితాల్లో ఒత్తిడి దూరమై మానసిక ప్రశాంతత చేకూరేందుకు ఆధ్యాత్మికతే మార్గమన్నారు. అందుకే రాష్ట్రంలో 5 వేల శ్రీవారి ఆలయాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు.

Chandrababu Flags Off Jagannath Rath Yatra Urges Stronger Spiritual Values for a Harmonious Society

అమరావతి రాజధాని నగర బృహత్ ప్రణాళికతో కూడిన చిత్ర పటాన్ని శిరస్సుపై ధరించి విశ్వ నగరిగా అమరావతి ఎదగాలని చంద్రబాబు జగన్నాథుడిని కోరుకున్నారు. భారతీయ సంస్కృతిలో భాగమైన ఉమ్మడి కుటుంబాలు రావాలని, మైక్రో ఫ్యామిలీలు కాదని చంద్రబాబు తెలిపారు. పూరీ క్షేత్రంలో నిర్వహించే జగన్నాథ రథ యాత్రకు ఎంతో ప్రత్యేకత ఉందని.. అలాంటి రథ యాత్రను అమరావతిలో తొలిసారి నిర్వహించటంపై ఆయన సంతోషం వ్యక్తంచేశారు. ప్రతీ ఏటా జగన్నాథ రథ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఇస్కాన్ సంస్థ ప్రకటించిందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+