తీవ్రవాదానికి గిరిజనులు దూరం: సిఎం

గిరిజనులందరికీ చివరి ఎకరాను కూడా పంపిణీ చేస్తామని, రుణాలు ఇప్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. గిరిజనులు కాఫీ, రబ్బరు తోటలు వేయడానికి తాము వెసులుబాటు కల్పిస్తున్నామని, అందుకు తగిన ఆర్థిక సాయం కూడా అందిస్తున్నామని, దాని వల్ల గిరిజనుల ఆదాయ వనరులు పెరుగుతాయని ఆయన చెప్పారు. పర్యావరణానికి ఇబ్బంది ఏ మాత్రం లేకుండా చూస్తున్నామని ఆయన చెప్పారు. గిరిజనుల సమస్యలకు కాంగ్రెసు పాలనలోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన చెప్పారు. మేధావుల ఆలోచనలను తాము పరిగణనలోకి తీసుకుంటామని, అయితే మేధావులు గిరిజనులకు మేలు చేసే విధంగా వ్యవహరించడం మంచిదని ఆయన అన్నారు. గిరిజనులకు అన్ని మేళ్లు జరిగేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications