అసెంబ్లీ ఉప సభాపతిగా మనోహర్

నాదెండ్ల మనోహర్ గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం నుంచి శాసనసభకు రెండో సారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కుమారుడు. 2004లో శాసనసభ్యుడిగా ఆయన తొలిసారి ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కు సన్నిహితంగా ఉంటూ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాలు పంచుకుంటున్నారు. గుంటూరు జిల్లా నుంచి డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన రెండో నాయకుడు నాదెండ్ల మనోహర్. గతంలో గుంటూరు జిల్లా వేమూరుకు చెందిన ఆలపాటి ధర్మారావు డిప్యూటీ స్పీకరుగా పని చేశారు.












Click it and Unblock the Notifications