బెలిజ్ అమెరికా రాయబారిగా హైదరాబాదీ
వాషింగ్టన్: హైదరాబాదుకు చెందిన ఇండియన్-అమెరికన్ వినయ్ కె తుమ్మలపల్లిని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా శుక్రవారం బెలిజ్ రాయబారిగా నియమించారు. అధ్యక్ష ఎన్నికల్లో తుమ్మలపల్లి ఒబామా ప్రచారం కోసం 50 వేల డాలర్ల నిధులు సేకరించారు. మెకానికల్ ఇంజినీర్ అయిన తుమ్మలపల్లి 1974లో అమెరికాకు వచ్చారు.
ఆయన ఎంఎఎం ఇన్ కార్పోరేషన్ లో పని చేస్తూ వస్తున్నారు. దీనికి ముందు తుమ్మలపల్లి మిత్సూయి అడ్వాన్స్ డ్ మీడియా ఇన్ కార్పోరేషన్ లో జనరల్ మేనేజర్ గా పనిచేశారు. ఆయనకు 31 ఏళ్ల సర్వీసు ఉంది. తుమ్మలపల్లి కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ లో బిఎస్ చేశారు. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్చు చేశారు.












Click it and Unblock the Notifications