బెంగుళూర్ లో నలుగురికి స్వైన్ ఫ్లూ
న్యూఢిల్లీ: న్యూజెర్సీ నుంచి బెంగుళూర్ కు వచ్చిన నలుగురికి స్వైన్ వ్యాధి సోకినట్లు సమాచారం. వీరిలో తల్లీ కూతుళ్లు ఉన్నారు. దీంతో భారత్ లో స్వైన్ ఫ్లూ వ్యాధి సోకిన వారి సంఖ్య 20కి చేరుకుంది. ఇదిలా ఉంటే చెన్నైలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వైద్య పరీక్షల్లో వారి వ్యాధి నిర్ధారణ జరగాల్సి ఉంది.
స్వైన్ ఫ్లూ వ్యాధి నివారణకు అన్ని చర్యలూ తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఈ వ్యాధి బయటి నుంచి వచ్చినవారికే ఉంటోందని, దేశంలో వ్యాప్తి చెందడం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ అన్నారు.












Click it and Unblock the Notifications