తాలిబన్లను అంతం చేస్తాం: జర్దారీ
ఇస్లామాబాద్: తాలిబన్లను అంతం చేసి తీరుతామని పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ అన్నారు. పాకిస్తాన్ తన సార్వభౌమాధికారం కోసం తాలిబన్లపై దాడులు చేస్తోందని ఆయన చెప్పారు. తాము సార్వభౌమత్వం కోసం పోరాటం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తాలిబన్లతో పోరాటంలో తాము విజయం సాధిస్తామని ఒక టెలివిజన్ చానెల్ ఇంటర్వ్యూలో ఆయన అన్నారు.
తాలిబన్లు అమాయక ప్రజల శత్రువులని, ప్రజలను భయబ్రాంతులకు లోను చేసి దేశ వ్యవస్థలను నియంత్రణలోకి తీసుకోవాలని తాలిబన్లు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications