నన్ను చంపడానికి కుట్ర: కెసీఅర్
హైదరాబాదు: మీడియాకు దూరంగా ఉంటున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు పార్టీ సమావేశంలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. తనను హత్య చేయడానికి సమైక్యవాదులు కుట్రపన్నారని చంద్రశేఖర రావు ఆరోపించారు. తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. తనను హత్య చేసి తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చాలని చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ కోసం తల నరుక్కుంటానన్నారు. టిక్కెట్ల పంపిణీలో ఎటువంటి అవకతవకలకు పాల్పడలేదన్నారు. వైఎస్ కి అమ్ముడుపోయినవారిని బహిష్కరించామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications