హైదరాబాద్: కెసిఅర్ రాత్రివేళ మత్తులో ఉంటారని అలాంటి సమయంలోనే తమపై బహిష్కరణ వేటు నిర్ణయం తీసుకుని ఉంటారని బహిష్కరణకు గురైన అసమ్మతి నేతలు చంద్రశేఖరరావు, జిట్టా బాలకృష్ణారెడ్డి అన్నారు. ముందుగా నోటీసు ఇవ్వకుండా తమను ఎలా బహిష్కరిస్తారని ప్రశ్నించారు. కెసిఅర్ రాత్రి నిర్ణయాలకు ఎలాంటి విలువ లేదన్నారు. చంద్రశేఖర్, బీరవోలు సోమిరెడ్డి, యన్నం శ్రీనివాసరెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, ఉమాదేవిలను పార్టీనుంచి బహిష్కరించారు. వీరు మాట్లాడుతూ ఈరోజు ఆయన ఏం మాట్లాడతారో చూస్తామని అనంతరం తామేం చేయాలో నిర్ణయించుకుంటామని అన్నారు.