హైదరాబాద్: ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ నెల 18న ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ను కడప, చిత్తూరు జిల్లాల పర్యటనకు ఆహ్వానించేందుకు ఆయన ఢిల్లీ వెళుతున్నారు. అలాగే మన రాష్ట్రంలోని ఏడు సాగునీటి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలని ఈ సందర్భంగా ప్రధానిని సీఎం కోరనున్నారు. తిరుపతిలో ప్రధాని మన్మోహన్ సింగ్ అనేక కార్యక్రమాల్లో పాల్గొనవలసి ఉంది. ఇక మీదట ఏ కార్యక్రమాన్నైనా తిరుపతి నుంచే ప్రారంభిస్తామని సిఎం రాజశేఖరరెడ్డి ఇదివరకే స్పష్టం చేశారు.