తిరుపతిలో మరో మెడికల్ కాలేజి
హైదరాబాద్: తిరుపతిలోని స్విమ్స్ ఆధ్వర్యంలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి మరో వైద్య కళాశాల ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు టీటీడీ ఛైర్మన్ ఆదికేశవులు నాయుడు తెలిపారు. బుధవారం ముఖ్యమంత్రి స్విమ్స్ సమీక్ష జరిపారు. ఇందుకోసం తొలివిడతగా రూ.60 కోట్లు విడుదలకు టీటీడీ ఆమోదం తెలిపింది. 150 ఎకరాల్లో వైద్య కళాశాలతో పాటు, శంకరనేత్రాలయ ఆధ్వర్యంలో కంటి ఆస్పత్రి నిర్మాణం ఏర్పాటు చేయనున్నట్లు చైర్మన్ పేర్కొన్నారు. అలాగే తిరుమలలో వీఐపీల దర్శన సమయాన్ని తగ్గించనున్నట్లు తెలిపారు. సామాన్య భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications