తిరుపతి: తిరుపతి ఎమ్మెల్యే, పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి నేడు, రేపు తిరుపతిలో పర్యటిస్తారు. ఈరోజు ఉదయం ఆయన తిరుపతి చేరుకున్నారు. అక్కడినుంచి పద్మావతి గెస్ట్ హౌస్ కు వెళ్లారు. అక్కడ ఆయన పార్టీ నాయకులను కలిసి మాట్లాడతారు. అనంతరం నగరంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి అధికారులను మర్యాదపూర్వకంగా కలుస్తారు. తర్వాత ప్రభుత్వ హాస్టళ్ల తనిఖీ, వార్డుల పర్యటన ఉంటుంది. సాయంత్రం తిరిగి పార్టీ నేతలను కలుస్తారు.