డిఎస్ ఎదుటే కార్యకర్తల ఘర్షణ
ఆదిలాబాద్: అదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జిల్లా కాంగ్రెసు కమిటీ (డీసీసీ) సమావేశం రాసాభాసగా మారింది. కుర్చీలు, రాళ్లతో కాంగ్రెస్ వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఎమ్మెల్సీ ప్రేంసాగర్, మాజీ పార్లమెంటు సభ్యుడు ఇంద్రకరణ్ రెడ్డి వర్గాలు బాహాబాహీకి దిగాయి.
ఎమ్మెల్సీ ప్రేంసాగర్ వాహనాన్ని ప్రత్యర్థి వర్గాలు ధ్వంసం చేశాయి. పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జి చేశారు.పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ నచ్చజెప్పినా కాంగ్రెసు కార్యకర్తలు వినలేదు. సభా వేదికపైనే రాళ్లు విసురుకునన్నారు.












Click it and Unblock the Notifications