చర్చలకు మావోయిస్టులు రెడీ
న్యూఢిల్లీ: తమ ఆపరేషన్ లో భాగంగా భద్రతా బలగాలు ప్రవేశించిన నేపథ్యంలో మావోయిస్టులు ప్రభుత్వంతో చర్చలకు సిద్ధపడ్డారు. భద్రతా బలగాల దాడులను ఆపి, చర్చలకు అధికారులు రావాలని మావోయిస్టులు ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం.
భద్రతా బలగాలు మావోయిస్టులు పెట్టిన మందుపాతరలను తొలగించుకుంటూ లాల్ గర్ కు చేరుకున్నాయి. మావోయిస్టుల మద్దతుతో గిరిజనులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. మందుపాతర పేల్చివేతలో ఇద్దరు భద్రతాధికారులు గాయపడ్డారు. గిరిజనులు రోడ్లను తవ్విపోశారు. వంతెనలను కూల్చారు. అభివృద్ధిని వామపక్ష ప్రభుత్వం సహించకపోవడం వల్లనే గిరిజనులు తిరుగుబాటు చేశారని మావోయిస్టు పోలిట్ బ్యూరో సభ్యుడు కోటేశ్వర రావు అన్నారు.












Click it and Unblock the Notifications