ఎంసెట్ ర్యాంకులు విడుదల
హైదరాబాదు: జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ(జెఎన్‌టియు)లో ఎంసెట్ ర్యాంకులను సాంకేతిక విద్యా శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ విడుదల చేశారు. ఎంసెట్‌లో ఇంజనీరింగ్‌కు 2,72,086 మంది, మెడిసిన్‌కు 66,351 అర్హత సాధించారు.
ఇంజనీరింగ్‌లో విశాఖపట్నంకు చెందిన గన్నవరపు గోపాల కృష్ణమూర్తి మొదటి ర్యాంక్ సాధించాడు. హైదరాబాదుకు చెందిన షేక్ అల్లాఉద్దీన్ ద్వితీయ, శివకుమార్ తృతీయ ర్యాంక్, శ్రావణ్ కుమార్ నాలుగవ ర్యాంక్ సాధించారు. కరీంనగర్‌కు చెందిన బొంతల శ్రావణ్ అయిదవ ర్యాంక్ సాధించింది.
మెడిసిన్‌లో నల్లా రవి మొదటి ర్యాంక్ సాధించాడు. స్వామినాథన్ ద్వితీయ, కీర్తన తృతీయ ర్యాంక్, మేఘన నాలుగవ ర్యాంక్, రామకిషన్ అయిదవ ర్యాంక్ సాధించారు.
ర్యాంకుల సమాచారం తెలుసుకునేందుకు www.apeamcet.org, www.manabadi.com లను సందర్శించవచ్చు .












Click it and Unblock the Notifications
