గుంటూరు: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తమ కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని ఆర్థిక మంత్రి కె.రోశయ్య చెప్పారు. గుంటూరులో సోమవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. మార్క్ ఫెడ్, ఇతర సంస్థల ద్వారా సరుకులు పొంది మార్కెట్ కు విడుదల చేస్తామని ఆయన చెప్పారు. ఆదాయం అంచనాలకు తగిన విధంగా లేనప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ాతీయ ఉపాధి హామీ వంటి వివిధ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తోందని, దీంతో కేంద్రం నుంచి ఎక్కువ నిధులను రాబట్టేందుకు ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. తాము చాలా పథకాలు అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.