వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆస్ట్రేలియా దాడులపై సుప్రీంలో పిటిషన్

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై జరుగుతున్న దాడులపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. ఈ దాడులపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ పిటీషన్‌ దాఖలైంది. దీనిపై విచారణను కోర్టు ఈనెల 29కి వాయిదా వేసింది. ఈ నెల 26లోగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది.

ఈ కేసులో ప్రభుత్వానికి సహకరించాలని జస్టిస్ దల్వీర్ భండారీ, అశోక్ కుమార్ గంగూలీలతో కూడిన సుప్రీంకోర్టు వెకెషన్ బెంచ్ సొలిసిటర్ జనరల్ ను ఆదేశించింది. ఆస్ట్రేలియాలో భారత విద్యార్థులపై జరుగుతున్న దాడుల విషయంలో ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ డికె గార్గ్ అనే న్యాయవాది ప్రజాప్రయోజనాల వ్యాజ్యం వేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X