దేవుడి సొమ్ము తింటే ఇబ్బందులు: వైయస్

YS Rajasekhar Reddy
హైదరాబాద్: దేవుడి సొమ్ము తింటే దీర్షకాలంలో ఇబ్బందులు ఎదురవుతాయని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. దేవుడి సొమ్ము తింటే కొంత మందికి బాగా అరుగుతుందని అంటారని, అయితే మొదట్లో బాగా అరిగినట్లు అనిపించినా దీర్షకాలంలో ఎవరూ బాగు పడలేరని ఆయన అన్నారు. దేవాదాయ శాఖ పనితీరును ఆయన సోమవారం సమీక్షించారు. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో విఐపిల దర్శన సమయం పెంచడం వల్ల సామాన్య భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటూ అలా జరగకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.

తిరుమల వేంకటేశ్వర దేవాలయ నిర్వహణ తీరు బేషుగ్గా ఉందని ఆయన మెచ్చుకున్నారు. ఆలయాల్లో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆయన చెప్పారు. 3 వేలకు పైగా దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆలయ ఉద్యోగులకు కూడా అన్ని వసతులు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. 4 లక్షల 33 వేల ఎకరాల ఆలయ భూముల నుంచి ఆదాయం రావడం లేదని ఆయన చెప్పారు. ఆలయ భూములను కబ్జా చేయడానికి వివిధ మార్గాల్లో వస్తారని, వారిని అడ్డగించాలని, ఏ విషయంలోనూ అధికారులు ఆశ్రిత పక్షపాతం చూపకూడదని ఆయన అన్నారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి గాదె వెంకటరెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+