73కు చేరిన స్వైన్ ఫ్లూ కేసులు
న్యూఢిల్లీ: కొత్తగా మరో ఐదు కేసులు నమోదు కావడంతో దేశంలో స్వైన్ ఫ్లూ సోకిన వారి సంఖ్య 73కు చేరుకుంది. కొత్తగా ఢిల్లీలో రెండు, మదురై, హైదరాబాద్, చండీఘర్ ల్లో ఒక్కటేసి కేసులు నమోదయ్యాయి. ఈ 73 కేసుల్లో ఆరుగురి దేశంలోనే ఉండేవారు. వీరికి ఇతర దేశాల నుంచి వచ్చినవారి నుంచి వ్యాధి అంటుకుంది.
కొత్తగా ఢిల్లీలో 40 ఏళ్ల వ్యక్తికి, అతని భార్యకు వ్యాధి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇతను, ఇతని భార్య అమెరికా నుంచి జర్మనీ మీదుగా ఢిల్లీ వచ్చారు. అమెరికా నుంచి ముంబై మీదుగా మదురై వచ్చిన ఎనిమిదేళ్ల బాలుడికి వ్యాధి సోకింది. ఇతను ఈ నెల 13వ తేదీన మదురై వచ్చాడు. అమెరికా నుంచి ఈ నెల 20వ తేదీన ఢిల్లీ మీదుగా చండీఘర్ వచ్చిన 19 ఏళ్ల యువకుడికి వ్యాధి సోకినట్లు బుధవారంనాడు తేలింది. హాంగ్ కాంగ్ నుంచి సింగపూర్ మీదుగా హైదరాబాద్ వచ్చిన 15 ఏళ్ల బాలికకు స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయింది.












Click it and Unblock the Notifications