కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా
హైదరాబాద్: అరెస్టయిన తెలుగుదేశం కొవ్వూరు శాసనసభ్యుడు టీవీ రామారావు హైదరాబాదులోని గాంధీనగర్ పోలీసు స్టేషనులో ధర్నాకు దిగారు. తనపై బనాయించిన కేసులను ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ ఆయన అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నాకు పోలీసులు అరెస్టు చేసి ఆయనను గాంధీనగర్ పోలీసు స్టేషనుకు తరలించారు. అక్కడ ఆయన సోమవారం ధర్నాకు దిగారు.
తనపై కేసులు ఎత్తేసే వరకు ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తానని ఆయన చెప్పారు. దళిత శాసనసభ్యుడైన తనపైనే ప్రభుత్వం వేధింపు చర్యలు చేపడితే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆయన అడిగారు. తనపై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు.
అనంతరం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ఇందిరా పార్కు వద్ద ధర్నాకు దిగారు. అక్కడ ధర్నాకు పోలీసులు అనుమతించారు.












Click it and Unblock the Notifications