బాబ్లీ పాపం కాంగ్రెసుదే: చిరు

సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టును నిర్మిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. సుప్రీంకోర్టులో మన రాష్ట్రం తరఫున వాదించడానికి సరైన న్యాయవాదుల నియామకం కూడా జరగలేదని ఆయన అన్నారు. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణ ఎడారిగా మారితే అందుకు కాంగ్రెసు పార్టీ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
బాటిళ్ల ద్వారా లీటర్ రెండు రూపాయల నీళ్లను పంపిణీ చేసే పథకంపై అనుమానాలున్నాయని ఆయన అన్నారు. బడా పారిశ్రామికవేత్తలకు లాభం చేకూర్చి పెట్టేందుకే ఆ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తుందని ఆయన సందేహించారు. రైతులకు విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు సరిగా సరఫరా చేయడం, పంటలకు గిట్టుబాట ధర కల్పించడం వంటి సౌకర్యాలు కల్పించిన తర్వాత కూడా ఫలితం రాకపోతే కొత్త విధానాన్ని అనుసరించడం అవసరమని, అదేమీ లేకుండా ప్రభుత్వం సహకార వ్యవసాయాన్ని ప్రారంభించబోతోందని, ఇది సరైన చర్య కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications