హైదరాబాద్: ఎన్నికల నియామవళిని ఉల్లంఘించి ప్రచారం నిర్వహించారనే ఆరోపణపై ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవిపై మూడు జిల్లాల్లో నమోదైన కేసుల విచారణపై నిలిపివేస్తూ సోమవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో తనపై నమోదైన కేసులకు సంబంధించి స్థానిక కోర్టుల్లో జరుగుతున్న విచారణ ప్రక్రియను నిలిపివేయాలంటూ చిరంజీవి దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది.