రాజ్యాంగేతర శక్తిగా కెవిపి కమిటీ: సిపిఐ
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కెవిపి రామచందర్ రావు చైర్మన్ గా వేసిన ప్రజా భద్రతా సలహా సంఘం రాజ్యాంగేతర శక్తిగా ఎదుగుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. కమిటీ చైర్మన్ గా కెవిపి రామచందర్ రావును నియమించడాన్ని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తప్పు పట్టారు. ఆ కమిటీని వెంటనే రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అధికార దురహంకారంతోనే బ్యాంక్ మేనేజర్ రవీందర్ రెడ్డిపై కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం దాడికి పాల్పడ్డారని ఆయన విమర్శించారు. మందా జగన్నాథంపై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదిలా వుంటే, తాను బ్యాంక్ మేనేజర్ పై దాడి చేయలేదని, భుజం పట్టుకున్నానని, దాంతో తాను చేయి చేసుకున్నట్లు కనిపిస్తోందని మందా జగన్నాథం ఒక తెలుగు టీవి చానెల్ ప్రతినిధితో అన్నారు. అడిగితే తాను పిసిసికి వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. కాగా, మందా జగన్నాథం వ్యవహారంపై వివరణ ఇవ్వాలని పిసిసిని కోరినట్లు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్పమొయిలీ చెప్పారు.












Click it and Unblock the Notifications