మనకు ఒబామా అనుకూలం: పిఎం

భారత్ లో తన దేశం నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు జరగకుండా పాకిస్తాన్ చిత్తశుద్ధితో కృషి చేయాల్సి ఉంటుందని ఆయన శనివారం అన్నారు. పాక్ ప్రధాని యూసుఫ్ రజా గిలానీతో ఆయన వచ్చే వారం ఈజిప్టులో భేటీ కానున్నారు. గిలానీతో సమావేశం కోసం తాను ఎదురు చూస్తున్నానని, ఈ సమావేశం ఫలితం సాధించగలదని ఆశిస్తున్నానని ఆయన అన్నారు.
తమ దేశం నుంచి భారత్ లో పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధిస్తే, ముంబై దాడుల నిందితులపై చర్యలు తీసుకుంటే సగం కన్నా ఎక్కువ దూరం నడవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఉగ్రవాద విషయంలో పాక్ తో సమస్యలున్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications