ఒంగోలు: కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి మధ్య రగులుకున్న చిచ్చు పెద్దదవుతోంది. "తెలుగు మహిళలపై దాడులు చేయించేటంతటి మగాడా దగ్గుబాటి?" అని రాజకుమారి వ్యాఖ్యానించడంపై దగ్గుబాటి అభిమానులు ఆమె మీద నిన్న దాడి చేసిన విషయం తెలిసిందే. "కారంచేడుకు దగ్గుబాటి దంపతులు చేసింది ఏమీ లేదు. మా కార్యకర్తలపై అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారు. వాడో మగాడా? తాట తీస్తా?" అని నన్నపనేని రాజకుమారి వ్యాఖ్యానించినట్టు మీడియాలో రిపోర్ట్ అయింది. తాను మహిళలపై అసభ్యంగా వ్యవహరించే వ్యక్తిని కానని దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒక టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.