కొట్టించుకోవడం ఆమెకు మామూలే: దగ్గుబాటి

ప్రకాశం జిల్లా కారంచేడులో నన్నపనేని రాజకుమారిపై కాంగ్రెస్ వర్గీయులు దాడిచేయడం అమానుషమని తెదేపా పోలిట్‌బ్యూరో సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఖండించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన సర్పంచ్‌పై అక్రమ కేసులు బనాయించడాన్ని ప్రశ్నించేందుకు వెళ్లిన తెదేపా బృందంపై దాడి ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. నయానో, భయానో ఇతరపార్టీల నాయకులను లొంగదీసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని అన్నారు. కారంచేడు ఘటనలో బాధ్యులైన వారిపై చర్య తీసుకోవాలని పోలీస్ యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications