ముంబయి: మెట్రో రైలు వంతెనల నిర్మాణాలు ఇంకా వికటిస్తూనే ఉన్నాయి. రెండు రోజుల క్రితం ఢిల్లీలో నిర్మాణంలో మెట్రో రైలు వంతెన కూలిన ఘటన మరచిపోకముందే ముంబైలో మరో ఘటన చోటు చేసుకుంది. సబర్బ్ ప్రాంతంలో నిర్మిస్తున్న మెట్రో రైలు వంతెన పిల్లర్ కుప్పకూలింది. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అక్కడకు చేరుకున్న అధికారులు శిధిలాలను తొలగిస్తున్నారు. దీనిపై మెట్రో రైలు అధికారులు మాట్లాడుతూ దీనిపై విచారణకు ఆదేశిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు ఎడతెరపి లేకుండా పడుతున్న వర్షాలు ముంబైను అతలాకుతలం చేస్తున్నాయి.