హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నెమళ్ళ వేటగాళ్ళు ఎంపీ చుట్టాలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పవిత్రమైన పదవుల్లో ఉన్న వ్యక్తుల బంధువులు పరమ కిరాతకానికి దిగిన సంఘటన ఇది. హైదరాబాద్‌ శివార్లలోని అటవీ ప్రాంతంలో నెమళ్లను వేటాడడానికి వచ్చిన ఐదుగురు వ్యక్తులు పోలీసులకు చిక్కారు. వీరిలో ఇద్దరు హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ బంధువులని తెలుస్తోంది. ఎస్సై ఎల్‌.రాములు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌ పాతన గరంలోని ఆగాపురకు చెందిన ఖాసీం (36), జమీర్‌అలీ (25), కైసర్‌అలీ (28), ఫరూక్‌ అహ్మద్‌ (57), రఫీక్‌ హుస్సేన్‌ (30) సోమవారం సాయంత్రం నెమళ్లను వేటాడేందుకు రంగారెడ్డి జిల్లా కనకమామిడి రెవెన్యూ పరిధిలోని 500 ఎకరాల అడవికి వచ్చారు. జీపులో రెండు డబుల్‌ బ్యారెల్‌ తుపాకులు, వంద తూటాలు తీసుకొచ్చారు. నెమళ్ల కోసం ప్రయత్నించి, అవి కనిపించకపోవడంతో...చిన్నాచితకా పక్షులపై గురిపెట్టారు. తుపాకీ శబ్దాలు వస్తుండడంతో పరిసర ప్రాంతాల్లోని రైతులు ఆందోళన చెంది పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సైలు రాములు, యాలాద్రి సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితులను అదుపులోకి తీసుకుని, జీపు, తుపాకులు, తూటాలు స్వాధీనం చేసుకున్నారు. జీపుపై 'మెంబర్‌ ఆఫ్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ' అని రాసి ఉంది. అద్దంపై అసెంబ్లీ పాసు స్టిక్కరు ఉంది.

నింది నిందితుల అరెస్టు తెలుసుకున్న కార్వాన్‌ ఎమ్మెల్యే అఫ్సర్‌ఖాన్‌(మజ్లిస్‌) ఆగమేఘాలమీద మొయినాబాద్‌ ఠాణాకు చేరుకున్నారు. వారిని విడిపించుకునేందుకు ప్రయత్నించారు. అక్కడే విలేకర్లు ఉండడంతో ఏమీ మాట్లాడలేకపోయారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X