వైజాగ్ కు టెర్రరిస్టుల ముప్పు
విశాఖ: మరో సింగపూర్ లాగా అభివృద్ధి చెందుతున్న వైజాగ్ నగరానికి టెర్రరిస్టుల ముప్పు పొంచి ఉంది. విశాఖకు ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అప్రమత్తమైన పోలీసులు వైజాగ్‌లో భద్రతను మరింత పటిష్ట పరిచారు. ఉన్నతాధికారులు 48 గంటల పాటు విస్తృత తనిఖీలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో వచ్చిపోయే ప్రతి వాహనాన్ని తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా ఉగ్రవాదులు జలమార్గం ద్వారా వచ్చే అవకాశం ఉందని ఐబీ హెచ్చరించడంతో పోర్టు వద్ద భద్రతను పటిష్టపరిచారు. 10 బృందాలతో కోస్తా తీరంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications