ఏపీ మీకు సారీ చెప్పాలి..! మళ్లీ రండి- గల్లాను కోరిన లోకేష్..!

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరు టీడీపీ ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ (Galla Jayadev) తమ కుటుంబ సంస్థ అయిన అమర రాజా బ్యాటరీస్ ను విస్తరించేందుకు చేసిన ప్రయత్నాలకు అడ్డంకులు తప్పలేదు. దీంతో ఆయన ఏపీ వదలి తెలంగాణకు వెళ్లిపోయి అక్కడ 6 వేల కోట్ల పెట్టుబడి పెట్టి అమర రాజా సంస్థను ఏర్పాటు చేసారు. తాజాగా అక్కడి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు వెళ్లి అమర రాజా సంస్థను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గల్లా జయదేవ్ పెట్టిన ట్వీట్ కు ఏపీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) స్పందించారు.

గల్లా జయదేవ్ గారూ, ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి అంటూ లోకేష్ ట్వీట్ మొదలుపెట్టారు. నాలుగు దశాబ్దాలకు పైగా, అమర రాజా కేవలం ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్ప పారిశ్రామిక విజయ గాథలలో ఒకటిగా మాత్రమే నిలవలేదని, ఇది ప్రపంచ స్థాయి తయారీ పరిశ్రమను స్థాపించి, వేలాది ఉద్యోగాలను కల్పించి, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్ కీర్తిని భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా చాటిందని లోకేష్ గుర్తుచేసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో మీ కంపెనీ ఎదుర్కొన్న వేధింపులు అస్సలు జరగకూడదన్నారు.

Nara Lokesh Apologises to Galla Jayadev for Past Harassment of Amara Raja

తన సొంత రాష్ట్రంలోనే స్థాపించాలని నిర్ణయించుకున్న ఒక పారిశ్రామికవేత్తకు ప్రోత్సాహం అవసరం, బెదిరింపులు కాదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పుట్టిన ఒక కంపెనీ తన తదుపరి అభివృద్ధి కోసం మన సరిహద్దులు దాటి చూడవలసి రావడం తనకు బాధ కలిగిస్తోందన్నారు. మనం విశ్వాసాన్ని తిరిగి పెంపొందించుకుంటున్న ఈ తరుణంలో, ఆంధ్రప్రదేశ్ మరోసారి వాణిజ్యానికి ద్వారాలు తెరిచి ఉందని గుర్తించాలని కోరారు. అమర రాజా ప్రస్థానం ప్రారంభమైన ఈ రాష్ట్రంలోనే దాని అతిపెద్ద అధ్యాయాలు లిఖించబడతాయని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు. మా ద్వారాలు, మా హృదయాలు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి, మీ కొత్త తెలంగాణ ప్లాంట్‌కు శుభాకాంక్షలు అంటూ లోకేష్ ట్వీట్ ముగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+