హిందూపురం: బిజెపికి ఇటీవల రాజీనామా చేసిన సినీనటుడు నరేష్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఎలక్షన్స్ కు ముందు బీజేపీ రాష్ట్రశాఖ ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆయన, అనంతపురం జిల్లా హిందూపురం లోక్ సభ స్థానానికి పోటీచేసి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ హిందూపురం నియోజకవర్గ ఇన్ చార్జ్జి అంబికా లక్ష్మీనారాయణను నరేష్ కలిశారు. ఈ భేటీలో కాంగ్రెస్‌లో చేరేందుకు సహక రించాల్సిందిగా ఆ యనను కోరినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో సీఎం సమక్షంలో కొం దరు సినీప్రముఖులతో కలిసి పా ర్టీలో చేరేందుకు ప్రణాళిక సిద్ధంచేసుకున్నట్లు చెప్తున్నారు.