తిరుపతి: తిరుపతిలో పర్యటిస్తున్న ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ఈరోజు పద్మావతి అతిథిగృహంలో సంక్షేమ హాస్టళ్ల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం తిరుపతిలోని చిన్నబజారు వీధి, తీర్థకట్ట వీధిలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు విస్తరణలో తాము తీవ్రంగా నష్టపోతున్నామని వ్యాపారులు చిరు దృష్టికి తెచ్చారు. తోపుడుబండ్ల కార్మికులు కూడా తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమానికి చిరంజీవి హాజరయ్యారు.