వైయస్ ను కలిసిన సాయిరాం
హైదరాబాద్: ఎంసెట్ మెడిసిన్ లో 9వ ర్యాంకు సాధించిన సాయిరాం మంగళవారంనాడు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని కలిశాడు. తనకు న్యాయం చేయాలని కోరుతూ అతను ముఖ్యమంత్రికి ఒక వినతిపత్రం సమర్పించాడు. మెడిసిన్ లో చేరేందుకు వయోపరిమితి సరిపోదని సాయిరాంకు సోమవారం అధికారులు కౌన్సెలింగులో అడ్మిషన్ నిరాకరించిన విషయం తెలిసిందే.
మెడిసిన్ లో చేరడానికి ప్రతిపాదిత తేదీ నాటికి విద్యార్థికి 17 ఏళ్ల వయస్సు దాటి ఉండాలని భారత వైద్య మండలి నిబంధన. అయితే 17 ఏళ్లు పూర్తి కావడానికి సాయిరాంకు 15 రోజులు తక్కువయ్యాయి. దీంతో సాయిరాం ఇంతకు ముందు ఉన్నతాధికారులను ఆశ్రయించాడు. అతని ప్రవేశాన్ని ప్ర్తత్యేక కేసుగా పరిగణించి వయసు నిబంధనను సడలిస్తూ ఉన్నత విద్యాశాఖ ఈ నెల 18వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఉస్మానియాలో సోమవారం జరిగిన కౌన్సెలింగ్ లో అతనికి అధికారులు అడ్మిషన్ నిరాకరించారు. ఈ స్థితిలో తనకు న్యాయం చేయాలని సాయిరాం ముఖ్యమంత్రిని కోరాడు.
-
హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్












Click it and Unblock the Notifications