'తెలంగాణ భవన్ కెసీఆర్ సొత్తు కాదు'
హైదరాబాద్: అవసరమైతే తెలంగాణ భవనాన్ని స్వాధీన పరుచుకుంటామని మరోసారి అసమ్మతి నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి హెచ్చరిక చేశారు. ఎప్పటికైనా తెలంగాణ భవన్ తెలంగాణా ప్రజలదేనని జిట్టా తెలిపారు. గత కొద్దికాలంగా టీఆర్‌ఎస్ అధినేత నోరు విప్పకపోవడంతో అసమ్మతి నాయకులు మరోమారు తమ కార్యకలాపాలను ఉధృతం చేశారు.
తాజాగా కూకట్‌పల్లి నియోజకవర్గంలో బరిలో నిలిచిన సుదర్శన్‌రావు పార్టీని వీడనున్నారని వార్తలు వెలువడ్డాయి. అయితే మంగళవారం అసమ్మతినేత రహ్మన్‌ను సుదర్శన్‌రావు కలువడంతో అసమ్మతి రాజకీయాలు ఊపందుకున్నాయి.












Click it and Unblock the Notifications