భారత్ పై ఆధారాలు చూపలేదు: అమెరికా
న్యూఢిల్లీ: బెలూచిస్తాన్ అశాంతిలో భారత్ పాత్ర ఉందని చెప్పడానికి తగిన ఆధారాలను పాకిస్తాన్ చూపలేదని అఫ్గనిస్తాన్, పాకిస్తాన్ అమెరికా ప్రత్యేక ప్రతినిధి హూల్ బ్రూక్ స్పష్టం చేశారు. బెలూచిస్తాన్ లో అశాంతి చెలరేగడంలో భారత్ పాత్ర ఉందని పాకిస్తాన్ ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనని, అయితే పాకిస్తాన్ అందుకు తగిన ఆధారాలు చూపలేకపోయిందని ఆయన అన్నారు. గత వారంలో పాకిస్తాన్ నేతలతో జరిగిన చర్చలపై విలేకరులు ప్రశ్నించినప్పుడు ఆయన ఆ విధంగా ప్రతిస్పందించారు.
పాకిస్తాన్ తగిన ఆధారాలు చూపలేదని మాత్రమే ఆయన అన్నారు. వివరాలు అంతకు మించి వెల్లడించలేదు. కాశ్మీర్ సమస్యపై చర్చించడం తన పరిధిలో లేదని ఆయన చెప్పారు. భారత్ పట్ల తనకు ప్రత్యేకమైన భావన ఉందని, అన్ని దేశాల కన్నా భారత్ తనకు ఎక్కువగా తెలుసునని, ఏదైనా తేడా ఉంటే భారతీయులనే అడగాలని, అలాంటిదేమీ ఉన్నట్లు తనకు అనిపించడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications