యాసిడ్ దాడుల నిరోధానికి చట్టం: సబిత

మహిళలపై జరుగుతున్న దాడులను నిరోధించేందుకు టోల్ ఫ్రీ నెంబరు కూడా ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. మహిళా క్రికెటర్లపై వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో చాముండేశ్వరీనాథ్ పై దర్యాప్తు నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టామని ఆమె చెప్పారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని ఆమె అన్నారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం ప్రతిపక్షాలు మానుకోవాలని ఆమె సూచించారు.
మహిళలపై అత్యాచారాల సమస్య తిరిగి తమ వైపే తిరగడం తెలుగుదేశం పార్టీకి కాస్తా ఇబ్బంది కలిగించింది. మహిళ హోం మంత్రిగా ఉన్న సమయంలో మహిళలపై అత్యాచారాలు పెరగడం శోచనీయమని తెలుగుదేశం సభ్యురాలు అన్నపూర్ణమ్మ అన్నారు. మహిళకు పదవి ఇచ్చి అధికారం ముఖ్యమంత్రి తన వద్దే ఉంచుకున్నిారని ఆమె అన్నారు. దీనికి కాంగ్రెసు మహిళా శాసనసభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. మహిళల గురించి ఇన్ని మాటలు చెబుతున్న తెలుగుదేశం పార్టీ కొవ్వూరు శాసనసభ్యుడు రామారావు మహిళలను వేధిస్తే తాము కేసు పెడితే ఎందుకు సహకరించడం లేదని మంత్రి సురేఖ అన్నారు. దీంతో కొద్దిసేపు సభలో గందరగోళం చెలరేగింది.












Click it and Unblock the Notifications