'మగధీర' సినీ హాళ్లలో తొక్కిసలాట

Ram Charan Teja
హైదరాబాద్: చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజా నటించిన మగధీర ప్రదర్శిస్తున్న రాష్ట్రంలోని పలు సినిమా హాళ్లలో తొక్కిసలాట చోటు చేసుకుంది. మగధీర సినిమా చూడడానికి అభిమానులు పెద్ద యెత్తున తరలిరావడంతో వారిని అదుపు చేయడం కష్టంగా మారింది. దీంతో పలు చోట్ల తొక్కిసలాటలు జరిగాయి. హైదరాబాదులోని పాతబస్తీ సుధా థియేటర్ లో గోడ కూలింది. సినిమా టికెట్ల కోసం ఒక్కసారిగా ఎగబడడంతో తొక్కిసలాట జరిగి గోడ కూలింది. దీంతో పలువురికి గాయాలయ్యాయి. దీంతో ప్రేక్షకులు అక్కడి వాహనాలను ధ్వంసం చేశారు.గాయపడినవారిని అస్పత్రికి తరలించారు.

ఇదిలా ఉంటే, మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటలోని ఓ థియేటర్ లో కూడా తొక్కిసలాట జరిగింది. ఈ సంఘటనలో కూడా పలువురు గాయపడ్డారు. ఈ సినిమాను చిరంజీవి బావ మరిది అల్లు అరవింద్ నిర్మించారు. గజిని సినిమాలో వచ్చిన లాభాలను దీనికి పెట్టుబడిగా పెట్టారు. భారీ సెట్టింగులతో, భారీ గ్రాఫిక్స్ తో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాపై అల్లు అరవింద్ మాత్రమే కాకుండా చిరంజీవి కూడా భారీ ఆశలే పెట్టుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+