ఎయిర్ లైన్స్ బెయిల్ అవుట్ కు నో

ప్రయాణికుల ప్రయోజనాలను కాపాడాల్సి ఉంటుందని, అవసరమైతే డిజిసిఎ చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను పెంచుతుందని ఆయన చెప్పారు. పారామౌంట్ కూడా సమ్మెలో చేరుతుందా, లేదా అనేది తెలియదని ఆయన అన్నారు.
జెట్ ఇంధనంపై పన్నును, విమానాశ్రయాల చార్జీలను తగ్గించి తమకు సహాయం చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తే తప్ప తమకు మనుగడ ఉండదని పరిశ్రమ లాబీ ఇండియన్ ఎయిర్ లైన్స్ సమాఖ్య అభిప్రాయపడింది. జెట్ ఎయిర్ వేస్, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్, స్పైస్ జెట్, ఇండిగో, గోఎయిర్ ఈ సమ్మెకు పూనుకున్నాయి. ఈ సంస్థలు నడిపే విమానాల ద్వారా రోజుకు దాదాపు లక్ష మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు వెళ్తారు.












Click it and Unblock the Notifications