చంద్రబాబుపై తలసాని అలక

చంద్రబాబు నాయుడి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తలసాని శ్రీనివాస యాదవ్ విసురుగా వెళ్లిపోయారు. మీడియాతో మాట్లాడడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. దీంతో తలసాని శ్రీనివాస యాదవ్ మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి మరోసారి చంద్రబాబుకు ఝలక్ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణపై పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బహిరంగ విమర్శలు చేసిన శ్రీనివాస యాదవ్ కొన్నాళ్లకు సద్దుమణిగారు. తలసాని శ్రీనివాస యాదవ్ కు కాంగ్రెసు నుంచి వ్యతిరేకత ఎదురు కావడంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు చెబుతున్నారు.
దేవేందర్ గౌడ్ కు శ్రీనివాస యాదవ్ లకు మధ్య విభేదాలున్న విషయం బహిరంగ రహస్యమే. గతంలో దేవేందర్ గౌడ్ పై తెలంగాణ విషయంలో తలసాని విమర్శనాస్త్రాలు సంధించారు. ఇద్దరి మధ్య అప్పట్లో బహిరంగ మాటల యుద్ధమే సాగింది. ఇప్పుడు తిరిగి దేవేందర్ గౌడ్ ను పార్టీలో చేర్చుకోవాలనే చంద్రబాబు నిర్ణయం ఆయనకు మింగుడు పడడం లేదు.












Click it and Unblock the Notifications