వైయస్, బాబు మాటల సమరం

Chandrababu Naidu-YS Rajasekhar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడులకు మధ్య సోమవారం మాటల యుద్ధం సాగింది. హైదరాబాద్ అభివృద్ధిపై మొదలైన మాటల యుద్ధం వ్యక్తిగత విమర్సలకు దారి తీసింది. పరస్పరం సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. హైదరాబాద్ అభివృద్ధి కాంగ్రెసు పాలనలో జరిగిందని ముఖ్యమంత్రి అన్నారు. ఆయన ఈ సందర్భంలో చేసిన వ్యాఖ్యలు దుమారానికి దారి తీశాయి. తమ పాలనలో పాతబస్తీ అభివృద్ధికి 4 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని, చంద్రబాబు పాలనలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఆయన విమర్శించారు. ఒక్కసారై చంద్రబాబు పాతబస్తీ ముఖం చూశారా అని ఆయన అడిగారు.మెట్రో రైలు ప్రాజెక్టుపై చర్చకు సమాధానం ఇస్తూ ఆయన చర్చను హైదరాబాద్ అభివృద్ధి వైపు మళ్లించారు.

మెట్రో రైలు ప్రాజెక్టులో అవకతవకలు జరగలేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మేటాస్ సంస్థకు ఆర్థిక సామర్థ్యం లేదని తెలిసిన వెంటనే కాంట్రాక్టు రద్దు చేశామని ఆయన చెప్పారు. ఢిల్లీ మెట్రో రైలు ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధరన్ మేధావి అయితే కావచ్చు గానీ ఢిల్లీ మెట్రో ప్రాజెక్టు కూలిపోతే ఏమీ చేయలేకపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సమయంలో తెలుగుదేశం సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీంతో ముఖ్యమంత్రి చర్చను హైదరాబాద్ అభివృద్ధికి మళ్లించారు. చంద్రబాబుకు తొమ్మిదేళ్లు కూడా కృష్ణాజలాలను హైదరాబాదుకు తీసుకురావడానికి కుదరలేదని ఆయన అన్నారు. చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి అయి వుంటే హైదరాబాద్ అంతా బోలక్ పూర్ అయి ఉండేదని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాదులో తాము చేపట్టిన కార్యక్రమాలను ఆయన వివరించారు. ఈ సమయంలో చంద్రబాబుకు, వైయస్ కు మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+